blog single post
editoryal

2019-01-30 11:30:40

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి..!

ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజధాని నగరాల గురించి మనం ఆలోచించిన వెంటనే ఆకాశహర్మ్యాలు,వైవిధ్యంగా కాంతులీనుతూ విశాలమైన రోడ్లు,అద్భుతమైన నివాస సముదాయాలు గుర్తుకువస్తాయి.విశ్వనగరాలుగా పిలవబడే లండన్,టోక్యో,న్యూయార్క్,మెక్సికో అదే కోవలోకి వస్తాయి. మరొక్క సారి అదేస్థాయిలో అటువంటి అద్భుత నిర్మాణం రూపుదిద్దుకోబోతుంది.అదే ఆంధ్రుల కలల రాజధాని,  నవ్యంధ్ర రాజధాని అమరావతి…! వేలాదిగా నాటిన మొక్కలతో  నగర నిర్మాణంలో 60%పచ్చదనానికి మరియు నీటి వసతులకు ప్రాధాన్యం ఇస్తూ,సౌర శక్తిని తగిన అవసరాలకు వినియోగించుకునేవిధంగా,పర్యావరణ హితమైన,కాలుష్య రహిత వాహాన వినియోగాలతో , అద్భుత భవనాలతో పవిత్ర కృష్ణా నది తీరాన పరిఢవిల్లనుంది. న్యూయార్క్ వంటి మహానగరంలో ఉన్న సెంట్రల్ పార్క్ మాదిరి 5.5కి.మీ. విస్తీర్ణంతో అమరావతి నగరంలో నిర్మించనున్న ఉద్యానవనం తలమానికం కానుంది.ప్రభుత్వం అంచనాల ప్రకారం రాజధాని పరిధిలో 4,30,000 ఉద్యోగ అవకాశాలు ఆసుపత్రులు,విద్యాసంస్థలు,వాణిజ్య,ఉత్పాదకం వంటి వివిధ రంగాల్లో ఏర్పడనున్నాయి.అల్ప ఆదాయ వర్గాలకు 5000నివాసాలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పడనున్నాయి.వ్యవసాయాన్నీ ప్రాణ ప్రదంగా భావించే 28,000మంది రైతులు 138చ.కి.మీ భూమిని రాజధాని నిర్మాణానికి ఇవ్వడం విశేషం.బహుశా ఇటువంటిది  ప్రపంచ దేశాల్లో కూడా ఇదివరకు ఎన్నడూ జరగలేదు.వారికి తిరిగి వారి భూమిని అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది.2021కల్లా పూర్తి స్థాయిలో శాశ్వత నిర్మాణాలు జరుపుకోనున్నాయి.ప్రస్తుతం నగర నిర్మాణ అంచనా వ్యయం 6.5లక్షల కోట్లు గా అంచనా వేయవచ్చు. విమర్శకులు రాజధాని నిర్మాణాన్ని ఆలస్యం అవుతుందని అపహాస్యం చేసినా ఈ నగరం 2050నాటికి 3. 5 మిలియన్ అనగా 35లక్షల మంది ప్రజలకు నివాసయోగ్యం కానుంది.భవిష్యత్తులో ఈ సంఖ్య అధిక సంఖ్యలో పెరగనుంది.ప్రపంచంలోనే పేరుగాంచిన మొదటి 100 నగరాల సరసన చెరనున్నది మాత్రం అక్షర సత్యం…!

 

             

                              సంగ్రహణ:ప్రపంచ ఆర్థిక వేదిక

                              అనువాదం:నవయువగళం