blog single post
editoryal

2019-01-22 11:16:59

ఛేజింగ్ లోనే కాదు రికార్డుల్లోనూ కింగ్!

 

అతడు మైదానంలో  గంగూలీ లాగా ప్రత్యర్దులపైకి దూకుడుగా వెళ్లగలడు…ఆటలో  క్రికెట్ శిఖరం సచిన్ లాగా సెంచరీలతో పరుగుల వరద పారించగలడు … ద్రావిడ్ ల జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని తానై క్రీజులో పాతుకు పోగలడు...లక్ష్మణ్ లా టెక్నిక్ తో ఆకట్టుకోగలడు…అతను క్రీజు లో ఉంటె కొండంత లక్ష్యమైన చిన్నబోతుంది. అతను  మరెవరో కాదు భారత్ క్రికెట్ కొత్త చరిత్రలో మేరునగ పర్వతంలా అనతి కాలంలోనే తాను ఎదిగి జట్టును అన్ని ఫార్మాట్లలో విజయ తీరాల వైపు నడిపిస్తున్న “విరాట్ కోహ్లీ” ప్రస్తుతం ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలలోను పరిచయం అవసరం లేని పేరు…. 71 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి భారత్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. గతేడాది అటు బ్యాట్స్‌మన్‌గా.. ఇటు సారథిగా అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్.. ఈ రెండు జట్లకు సారధ్య బాధ్యతలు సంపాదించుకోవడం విశేషం.ఐసీసీ ప్ర‌క‌టించిన ప్రపంచ టెస్ట్ టీమ్‌, వ‌న్డే టీమ్ కెప్టెన్‌గా కూడా కోహ్లీయే నిలిచాడు. ఈ ఏడాది 13 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 1322 ప‌రుగులు చేశాడు. అందులో ఐదు సెంచ‌రీలు ఉన్నాయి. అలాగే 14 వ‌న్డేల్లో ఆరు శ‌త‌కాల‌తో మొత్తం 1202 ప‌రుగులు చేశాడు. దీంతో కోహ్లీ అన్ని అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకే ఏడాది ముడూ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను సాధించిన క్రికెట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ లేరు. కోహ్లీ మాత్ర‌మే తొలిసారి ఆ ఘ‌న‌త సాధించాడు.ఈ దూకుడును ఇదే విధంగా కొనసాగించి పరుగుల వరద కొనసాగిస్తే ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో భారత్ జయ కేతనం ఎగుర వేయడం ఖాయం..!

 

 

 

                               ................. నవయువగళం