blog single post
editoryal

2019-01-12 11:07:35

జాతీయ యువజనోత్సవం

“ఒక వ్యక్తిని శక్తిగా ప్రభావితం చేసే మనోవికాసం మానవ మనుగడకు,వ్యక్తిత్వ పరిణితికి దోహదపడుతుంది. అటువంటి వికాసానికి వెలుగుకిరణాలు ప్రసరింప చేసి భారత యవనిక పై తనదైన ముద్రవేసిన  “స్వామి వివేకానందకు నివాళిగా”

 

రోజుకి ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేక పోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు.

మందలో ఉండకు ..వందలో ఒకడిగా ఉండటానికి ప్రయత్నించు..

ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..

కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు

మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.

ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది.

 

అంటూ భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు.భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని భావించిన ధన్యుడు వివేకానంద ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు.మరణం మనిషికే వారు నింపిన స్ఫూర్తికి కాదు…ఆయన చూపిన బాట సదా అనుసరణీయం…

 

జాతీయ యువజనోత్సవం  సందర్భంగా నవ్యంధ్ర టైమ్స్ పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ...!

                                                                                                                                                                  _____________________నవయువగళం