blog single post
editoryal

2019-01-07 11:12:46

సాకారమైన దశాబ్దాల నిరీక్షణ..!

అక్కడ అడుగుపెడితే విజయం మాట అటువుంచితే కనీసం డ్రాతోనైనా సిరీస్ సరిపెట్టుకుంటే చాలు అని ఏ జట్టు అయినా భావించేది.. ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆటలతోనే కాకుండా మాటలతో సైతం దాడి చేసే ఆస్ట్రేలియా జట్టును కానీ అక్కడ వేగవంతమైన పిచ్ లను పేస్ ను ఎదుర్కొని విజయం సాదించడం అంత తేలిక కాదు… ఎంతో మంది గొప్ప క్రికెటర్ల నాయకత్వంలో కూడా గెలుపుటంచుల దాకా వెళ్లి భంగపడ్డ సందర్భాలు కోకొల్లలు..

కానీ ఇటువంటి చేదు జ్ఞాపకాలన్నిటిని కాలదన్ని సుదీర్ఘ కాలపు కలని భారత్ క్రికెట్ జట్టు సాకారం చేసుకుంది.ఈ విజయం నా కెరీర్‌లో ఎంతో ఉత్తమమైనది. భారత్‌ ప్రపంచ కప్‌ గెలిచినప్పుడు ఆ జట్టులో నేను చిన్నవాడిని. ఆ సమయంలో జట్టులోని ప్రతి ఒక్కరూ విజయంతో ఎంతో భావోద్వేగానికి గురవడం నేను చూశా. అయితే నేను అప్పుడు అలా ఫీల్‌ కాలేకపోయా. ఇక్కడికి మూడుసార్లు వచ్చిన అనంతరం విజయం ఎంత కఠినమో తెలిసొచ్చింది. నేను టెస్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపైనే బాధ్యతలు చేపట్టా. ఇక్కడి నుంచే  మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది’ అని కోహ్లీఎంతో భావోద్వేగంతో అన్నాడు.1980-81లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలో,1985-86 కపిల్ దేవ్ నేతృత్వంలో,2003-04లో అత్యంత విజయాలు అందించిన గంగూలీనేతృత్వంలో సాధించలేని విజయాన్ని అందుకున్న తరువాత కోహ్లీ ఈ విధంగా స్పందించాడు.ఏడు దశాబ్దాల తరువాత ఇటువంటి విజయం అందుకోవడం అనే ఘట్టంలో భాగమైనందుకు ప్రతి ఆటగాడు విజయ గర్వంతో ఆనందపడుతుంటాడు. టీమిండియా 1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటి నుంచి పదిసార్లు అక్కడ పర్యటించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది సార్లు ఓడితే, మరో మూడు సార్లు ‘డ్రా’ చేసుకొని రావడం తప్ప ఒక్కసారి కూడా సిరీస్‌ గెలుపు రుచి చూడలేదు. ఈ రికార్డును ఇప్పుడు కోహ్లీ సేన బ్రేక్ చేసింది. అలాగే, ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి. అంతేకాదు, ఈ సిరీస్‌లో భారత్ ఎన్నో రికార్డులను నమోదు చేసింది. అలాగే ఈ సిరీస్ ద్వారా రిషబ్ రూపంలో మంచి కీపర్.. బూమ్రా రూపంలో పేస్‌కు నాయకుడు దొరికారు.ఈ విజయంతో 2019 భారత్ వరల్డ్ కప్ లక్ష్యంగా బరిలోకి దిగి దానిని కూడా కైవసం చేసుకోవాలని ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు.

_____________________నవయువగళం