blog single post
editoryal

2018-12-26 10:18:12

తెలంగాణ వాడిదేనా పౌరుషం ఆంధ్రుడికి లేదా రోషం!

అవమానించారు, బూతులు తిట్టారు, వితండవాదాలు చేసారు చివరకి కట్టుబట్టలతో నెత్తిన అప్పులు పెట్టి ఆంధ్రాని అనాధ చేసారు. పయనమెటు తెలియదు గమ్యంఏటో తెలియదు, ఎటు నుండి మొదలుపెట్టాలో తెలియదు, చిల్లి గవ్వ లేదు అయ్యినా శక్తి యుక్తులనీ కూడదీసుకుని రాష్ట్రాన్ని నిలపెట్టుకుంటున్నాం. అవరోధాలనిసవాలుగా స్వీకరించి మెట్టు మెట్టు ఎక్కుతున్నాం. మోసం చేసినోళ్లు కక్ష గట్టి కత్తులు దూస్తున్నా పట్టుజారకుండా జాగ్రత్తగా రాష్ట్రాన్ని నడుపుకుంటున్నాం. ఎంత చేసుకుంటున్నా ఇంటి దొంగలు వాళ్ల పనిలో వాళ్ళు ఉన్నారు. మన కష్టాన్ని హేళన చేస్తూ మన భవిష్యత్తుని నాశనం చేస్తూ మన ఆశలకు ఊపిరి తీసేస్తూ మన ఊహలకి రెక్కలు విరిచేస్తూ శత్రువులతో చేతులు కలిపి రాజ్యాధికారమే పరమావిధిగా వికృత రాజకీయం చేస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పన్నంగా  పెడుతున్నారు.

తెలంగాణ ప్రజలు అభివృద్ధితో సంబంధం లేకుండా కేవలం తెలంగాణ వాదంతో తెరాస ని గెలిపించారు. వాళ్లకి కావాల్సిన రాష్ట్రము వాళ్లకి వచ్చినా అక్కడినాయకులు ఆంధ్ర అభివృధికి అడ్డుపడుతున్నారు. ఆంధ్రుల జీవనాడి అయ్యిన పోలవరం ని వ్యతిరేకిస్తున్నారు, ఆంధ్రా కి ప్రత్యేకహోదా వద్దు అంటున్నారు. ఆంధ్రాకిరావలసిన బకాయిలు ఇవ్వరు, ఆంధ్ర నాయకులు తెలంగాణాలో ప్రచారం కూడా చేసుకోకూడదు అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా  తెలంగాణ ప్రజలు వాళ్ల వాదానికిమొగ్గు చూపారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ పౌరుషాన్ని చూపించారు తెలంగాణ ప్రజలు మంచికో చెడుకో ఐక్యమత్యాన్ని మాత్రం చూపించారు.

ఆంధ్రుడా (అందరూ కాదు) ఏది నీకు ఆ కసి? ఆంధ్రుడా ఏది నీకు ఆ ఐక్యమత్యం?  ఆంధ్రుడా ఏది నీకు ఆ పౌరుషం? మనం సిగ్గు లేని వాళమా? మనం చేవ చచ్చిన వాళమా? మనకి లేదా ఆత్మగౌరవం? మన శత్రువు గెలిస్తే సంబరాలు చేసుకోవడమేనా మన పౌరుషం? రాయలసీమ గాలి పీలుస్తూ, గుంటూరు కారం తింటూ, గోదావరి మసాలాని వంటికి పఠిస్తూ మనం చూపే పౌరుషం ఇదేనా? బూతులు తిట్టినా, మొకాన ఉమ్మినా తుడిచేసుకుని పక్క రాష్ట్రపు నాయకుడు వస్తే స్వాగత ఏర్పాట్లు చేస్తూ చెక్క భజన చేయడమేనా మన పౌరుషం? ఇదేనా ఆంధ్రుడి ఆత్మగౌరవం?

తెలంగాణ కన్నా అన్నిట్లో ముందున్నాం గత నాలుగు సంవత్సరాలు తీసుకుంటే. తెలంగాణ నాయకులకి కావలసింది ఒకటే ఆంధ్రా అభివృద్ధి చెందకూడదు. వాళ్ల ఆటలు సాగాలంటే ప్రజలకు ఆంధ్రాలో అభివృద్ధి కనిపించకూడదు. కక్ష గట్టి తోటి సోదర రాష్ట్రము అని ఇంగితం కూడా లేకుండా మన మీద కుట్రలు చేస్తా ఉంటె వాళ్లకి దండలు వేసి దణ్ణాలు పెట్టి మన రాష్ట్రాన్ని బలి ఇద్దామా? పోలవరం పరుగులు పెడుతుంది, దానిని ఆపాలని కెసిఆర్  ప్రయత్నిస్తుంటే ఆయనకి స్వాగత తోరణాలు కట్టి మన పరువు తీసుకుందామా? ఆంధ్రా కి ప్రత్యేక హోదా వద్దు అని అడ్డుపడుతుంటే ఆయనని మన భుజాన మొద్దామా? ఇంటి మనుషులే ఇంట్లో దీపం ఆర్పేస్తు వుంటే  ఏం అనాలి?

కుట్రలు చేసే వాళ్లకి లొంగిపోయి బానిసలం అవుదామా లేక ఒకటిగా అయ్యి తరిమికొడదామా? ఇది నా రాష్ట్రం ఇది నా జాతి ఇది నా భవిష్యత్తు ఇది నా పిల్లల భవిష్యత్తు ఎవడురా వచ్చి నా రాష్ట్రము మీద రాబందులలా పడేది కాచుకోండిరా ఆంధ్రుడి దెబ్బ  అని ఉరిమి ఉరిమి తరుముదామా లేక కుట్రలలో మనం కూడా భాగస్వాములు అవుదామా తేల్చుకోండి ఆంధ్ర ప్రజలలారా.

మన పౌరుషం మన కసి మన పోరాటం అన్నీ ఆంధ్ర జాతి అభివృద్ధికి అంకితం చేదాం కులాలకు మతాలకు అతీతంగా. తేల్చుకో ఆంధ్రుడా పౌరుషం తెలంగాణ వాడికేనా మనకు లేదా? మన భవిష్యత్ మన చేతుల్లో ఉంది ఒడిసిపట్టుకుంటారో కాళ్ళదన్నుకుంటారో మీ ఇష్టం. మన భవిష్యత్ కు మనమే కర్త కర్మ క్రియ. ఆంధ్ర జాతి కీర్తిని చరిత్రలో నిలుపుతారో చెత్తబుట్టలో వేస్తారో తేల్చుకోండి.