blog single post
editoryal

2018-12-21 16:35:48

“విలువ తెలియని ఉచితం “

మనకు ఏ విధమైన ఖర్చు లేకుండా ఉచితంగా లభించే వస్తువులకు పెద్దగా విలువ ఇవ్వం.ఈ కోవలోనిదే మనం పీల్చుకునే ప్రాణ వాయువు. మనం అనునిత్యం శ్వాసించే ప్రాణవాయువుకి వెలకట్టే ప్రయత్నం చేస్తే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది.రోజూ, ప్రతి మనిషి ప్రకృతి నుండి పీల్చుకునే ప్రాణవాయువు పరిమాణం మార్కెట్ లో వినియో గించే మూడు ఆక్సిజన్ సిలెండర్ల కు సమానంగా ఉంటుంది. సగటున ఒక్కో సిలెండర్ ధరరూ. 700 /- ( సబ్సిడీ లేకుండా...ఎందుకంటే, మోడీ గారు సామాన్యులకు ఏదైనా ఇవ్వాలంటే సబ్సిడీ లేకుండా ఇవ్వడానికే ఇష్టపడతారు) చొప్పున ఒక్కో మనిషి రోజుకి రూ. 2100 /-విలువైన ఆక్సిజన్ వినియోగిస్తాడు. అంటే ఒక సంవత్సర కాలంలో వినియోగించే ప్రాణ వాయువు విలువ రూ. 7,66 ,500 /- అన్న మాట.
ఒక మనిషి సగటు జీవిత కాలం 65 సంవత్సరాలు అనుకుంటే, ఒక్కో మనిషి తన జీవితకాలంలో ప్రకృతి నుండి ఉచితంగా వియోగించుకునే ప్రాణ వాయువు విలువ కళ్ళు చెదిరేమొత్తం అయిన, సుమారు రూ. 500 00 000 /-కు సమానం అన్నమాట. మనకు లభించే ఈ ప్రాణవాయువు మొత్తం మనచుట్టూ వున్న చెట్లు, అడవుల నుండి ఉచితంగా లభిస్తుంది. మన సమాజంలో ఈ సత్యాన్ని గ్రహించ గలిగిన మనుషులు కొద్దిమంది మాత్రమే వున్నారు. ఎక్కువ మంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చెట్లు, అడవుల నరికివేతకు పూనుకుని ప్రాణవాయు లభ్యతపట్ల గొడ్డలి పెట్టుగా మారుతున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. అలాంటి వారికి, వారు సమాజానికి చేస్తున్న హాని గురించి వివరించి, వారిని చైతన్య పరచి చెట్లు, అడవుల నరికివేతను, నిరోధించాల్సిన బాధ్యతను పౌర ధర్మం గల ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
హెచ్చరిక : ఈ సమాచారాన్ని ప్రజలు ఎంతమందైనా షేర్ చేసుకోండి గానీ, ప్రధానమంత్రి మోడీ కి మాత్రం చేరనీయకండి. ఒక్కో మనిషి సంవత్సరానికి రూ. 7 66 500 /- ల విలువైన ప్రాణవాయువు ఉచితంగా పీల్చేసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోవచ్చు. దీన్ని ఒక “ లగ్జరీ” గా నిర్ధారించి ప్రతి పౌరుడి పైనా, ఆ మొత్తం విలువ పై లగ్జరీ టాక్స్ గా 28 % GST విధించే ప్రమాదం పొంచి ఉందన్న విషయం గమనించగలరు. మనమేదో చెట్లు, అడవుల సంరక్షణకు సాయపడి ప్రాణవాయు పరిరక్షణ కు కృషి చేయబోయి, ప్రధాని మోడీ విసిరేలగ్జరీ టాక్స్ వలలో ఇరుక్కునే ప్రమాదాన్ని మాత్రం మరచిపోకండి.
___________________యలవర్తి శేఖర్