blog single post
editoryal

2018-11-19 09:37:10

తెలంగాణ అంటే నీ జాగీరు కాదు దొర

తెలంగాణ అంటే నీ జాగీరు కాదు దొర
తెలంగాణ నీకు గులాం కాదు దొర
బాంచన్ రోజులు పోయాయి దొర
తరిమే రోజులు వచ్చాయి ఓ దొర
 
దుఃఖ సాగరంలో ఉన్న తెలంగాణ తల్లిని చూడు దొర
హుస్సేన్ సాగరంలో కంపుకొడుతున్న బుధుడిని చూడు దొర
పగిలిన అద్దం లాంటి రహదారులని చూడు దొర
విరిగిన ఎముకల అతుకులకి అయ్యిన దవాఖానా ఖర్చులు చూడు దొర
 
దుర్గమ్మకి ముక్కు పుడకనిచ్చావు
కవితమ్మకు బతుకమ్మని ఇచ్చావు
పద్మమ్మకి పట్టు చీరలే ఇచ్చావు
శిస్తులు కట్టలేక ఆడబిడ్డల పుస్తులు తెగుతుంటే మాత్రం చోద్యం చూసావు
 
తెలంగాణ అంటే నీ జాగీరు కాదు దొర
తెలంగాణ నీకు గులాం కాదు దొర
బాంచన్ రోజులు పోయాయి దొర
తరిమే రోజులు వచ్చాయి ఓ దొర
 
పోరాటాలు తెలంగాణాకి అలంకారం దొర
నీ చర్యలే వాటికి అవమానకరం ఓ దొర
ఆరాటాలే వంద సీట్లకా దొర
వంద అబ్బధాలకి బొంద పెట్టరా ఓ దొర
 
చదువు చెప్పే గురువుకి కొలువులు ఏవి దొర
చదువుల కొలతలలో తెలంగాణ అట్టడుగు స్థాయి తెలుసా ఓ దొర
లక్ష ఉద్యోగాల ముచ్చట ఏది ఓ దొర
లక్ష రెండు పడకల ఇండ్లకు దారులు చూపవా ఓ దొర
 
తెలంగాణ అంటే నీ జాగీరు కాదు దొర
తెలంగాణ నీకు గులాం కాదు దొర
బాంచన్ రోజులు పోయాయి దొర
తరిమే రోజులు వచ్చాయి ఓ దొర

ఫార్మ్ హౌస్ అంటే ప్రాణం అన్నావు ఓ దొర 
సచివాలయం అంటే రోగం అన్నావు ఓ దొర       
దళితుల ఇళ్లల్లో వెలుగులు అన్నావు ఓ దొర     
మాటల గారడీ చేసి మందిని మోసం చేశావు ఓ దొర

ప్రశ్నిస్తే తిట్ల దండకమా ఓ దొర
ఎదిరిస్తే కారాగారమా ఓ దొర
ఇదేనా జగమెచ్చినా పాలన ఓ దొర
ఇదేనా బంగారు తెలంగాణ ఆలన ఓ దొర

తెలంగాణ అంటే నీ జాగీరు కాదు దొర

---ప్రసాద్