blog single post
editoryal

2018-11-15 15:23:40

"క్రికెట్ దేవుడు" ప్రస్థానం మొదలైంది ఈరోజే...!

అతను మైదానంలో కాలుపెడితే అతని పేరు హోరెత్తిపోద్ది...మైదానం నలుమూలల అతని నమస్మరణే... అతన్ని ఎదుర్కొనడానికి వ్యూహాలు ఎత్తుకునే ప్రత్యర్థి జట్లు...ఇతని ధాటికి పరుగులు పెట్టే స్కోర్ బోర్డులు..ఇంతకీ అతనెవరో అర్ధమయ్యే ఉంటుంది.అతనే..... "సచిన్ రమేష్ టెండూల్కర్".
అతను క్రీజులో నిల్చోని ఉంటే జట్టుకి ఓ భరోసా .... అతను క్రేజులో ఉన్నాడు అంటే క్రికెట్ అభిమానికి ఓ ధైర్యం జట్టు గెలుస్తుంది అని .... అందుకే అతను వేలాది క్రికిట్ అభిమానులకు "క్రికెట్ దేవుడు" అయ్యాడు . 
ఇప్పుడ సచిన్ ఏంతో మంది వర్ధమాన ఆటగాళ్ళ అందరికి స్పూర్తి .సచిన్ ఆటను చూస్తూ పెరిగిన వాళ్ళు ఇప్పడు స్టారు ఆటగాళ్లు అయ్యారు . ఇలాంటి క్రీడా రత్నం ప్రస్థానం గురించి నేమరవేసుకుంటూ ....
తన క్రికిట్ ప్రస్థానంలో ఏన్నో ఘనతలను ఎవరకీ సాధ్యపడని రికార్డులను నెలకొల్పాడు. తను ఎంతో మంది మేటి ప్రపంచ క్రికేటర్లతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు .అరవీర భయంకర బౌలర్లను తన బ్యాటింగ్ తో హడలేత్తించాడు. బహుశ అందుకే నేమో తను "గాడ్ ఆఫ్ క్రికిట్ " గా ప్రంపంచ ప్రసిద్దికెక్కడు. 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన క్రికెట్ ప్రస్థానంలో ఇదో ప్రత్యేకమైన రోజు.దాదాపుగా 25 సంవత్సరాల పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్  సచిన్  రమేష్ టెండూల్కర్. తాను క్రికెట్ లో అడుగుపెట్టింది 1989 నవంబరు 15వ తేదీన సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సచిన్ తన తొలి మ్యాచ్ ఆడాడు. సచిన్... 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అంత చిన్న వయస్సులోనే అరంగ్రేటం చేసిన మొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అయితే సచిన్ క్రికెట్ ను వీడినా.. అతను నెలకొల్పిన రికార్డ్ లు ఇంకా పదిలంగానే ఉండటం విశేషం.
వన్డే, టెస్టు ఫార్మాట్లలో కలిపి సచిన్ టెండూల్కర్ చేసిన సెంచరీల సంఖ్య 100 సెంచరీలు నమోదుచేశాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో పాటుగా వన్డేల్లోనూ మొట్ట మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 30వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు.వన్డే లో 18426 పరుగులు చేయగా , టెస్ట్ లో 15921 పరుగుల చేసి ఎవరు సాధించలేని ఘనతను తన సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్... మెగాటోర్నీలో అత్యధికసార్లు ఆడిన క్రికెటర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
క్రికిట్ దేవుడు మైదానాన్ని వదిలి వెళ్ళిన రోజు :- 
2013 నవంబర్‌ టెస్టు తర్వాత  24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఈ గాడ్ ఆఫ్ క్రికెటర్... 2013 నవంబర్ లో 16 తేదీన వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌ తర్వాత తన క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన క్రికెట్‌ అరంగేట్రపు రోజును గుర్తు చేసుకున్న సచిన్‌.. భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడాన్ని చిరస్మరణీయంగా పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం భారత జట్టు తరపున ఆడే అవకాశం రావడం ఒక అరుదైన గౌరవమని స్మరించుకున్నాడు.
సచిన్ ఆటకి దూరం అయిన తన ఆట ఎప్పటికి అభిమానుల గుండేల్లో జ్నాపకంగా నిలిచిపోతుంది .
_____________________నవయువగళం