blog single post
editoryal

2018-11-12 12:23:49

అదిగో అదిగో తెలుగోడి దమ్ము ...

అదిగో అదిగో తెలుగోడి దమ్ము ఎన్నో ఎన్నో కుట్రలన్నీ వమ్ము

ఒక్కడై కదిలాడు అందరినీ కలిపాడు

బాటే వేసాడు అందరినీ నడిపాడు

ఎదురే నిలిచాడు గురిపెట్టి కొట్టాడు

అదిగో అదిగో తెలుగోడి దమ్ము ఎన్నో ఎన్నో కుట్రలన్నీ వమ్ము

 

ఆరంభం అదిరిందా మీ సంబరం ముగిసిందా

శూరత్వం చూసారా శూన్యం కనిపించిందా

పౌరుషం తొడగొడితే పీఠం కదిలిందా

పంతం కసితీరా మీ అంతం మనసారా

 

అదిగో అదిగో తెలుగోడి దమ్ము ఎన్నో ఎన్నో కుట్రలన్నీ వమ్ము

ఒక్కడై కదిలాడు అందరినీ కలిపాడు

బాటే వేసాడు అందరినీ నడిపాడు

ఎదురే నిలిచాడు గురిపెట్టి కొట్టాడు

అదిగో అదిగో తెలుగోడి దమ్ము ఎన్నో ఎన్నో కుట్రలన్నీ వమ్ము

 

ఇచ్చాము గౌరవము చూపారు గర్వము

చూపాము సంస్కారము ఇచ్చారు పెద్ద బహుమానము

భరించాము అవమానం అనుకున్నారు బానిసత్వం

పోను పోను మీకు పూనకాలే చేస్తాము మీకు సన్మానము

 

అదిగో అదిగో తెలుగోడి దమ్ము దులుపుతుంది మీ దుమ్ము

 

---ప్రసాద్