blog single post
editoryal

2018-10-16 14:14:24

సోషల్ మీడియాలో అసంఖ్యాక అభిమానగణం...ఇది తెలుగుదేశానికి వరం...

సోషల్ మీడియా. నీకు నచ్చింది నీకు అనిపించింది నీకు తోచింది రాసుకునే వెసులుబాటు ఉన్న వేదిక. అలాంటి దానిని కొన్ని పార్టీలు వాళ్ల సానుభూతిపరులు అసత్యాలని ప్రచారం చేయడానికి వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర  పడేకుంది సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకుంటుంది. ఒక అసత్యాన్ని తిప్పి తిప్పి పదే పదే చెప్తే సత్యం అయ్యిపోతుంది అన్న చందాన వైసీపీ మరియు జనసేనకు చెందిన వాళ్ళు పేట్రేగిపోతున్నారు. వాళ్లకి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు వేరే పార్టీల లోపాలు ఎత్తి చూపించొచ్చు కానీ జరగనిది జరిగినట్లు లేదా ఎక్కడో వేరే రాష్ట్రము లో జరిగింది ఆంధ్రాలో జరిగినట్లు ప్రచారం చేయడం చేతగాని వాడి లక్షణాలు కదా. ఇంత దిగజారాల్సిన పని ఏంటి? తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షాత్తు బీజేపీ బాస్ అయ్యిన అమిత్ షా కార్యకర్తలకి నూరి పోశారు అంటే ఎంత హేయం ఎంత దుర్మార్గం.
సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అసంఖ్యాక బలగం ఉంది. స్వచ్చంధంగా పార్టీ మీద మమకారం తో పార్టీ కోసం సమయాన్ని కేటాయించి ప్రభుత్వం మరియు పార్టీ చేస్తున్న కార్యక్రమాలకి విస్తృత ప్రచారం కల్పిస్తారు. ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలని సాక్షాలతో సహా తిప్పికొడుతూ ప్రత్యర్థుల్ని డిఫెన్సె లోకి నెట్టడం తెలుగుదేశం అభిమానులకి వెన్నెతో పెట్టిన విద్య. సబ్జెక్టు మీద అవగాహనలో గాని ప్రభుత్వం చేసే మంచి పనులని జనాలకి అద్భుతమయిన రీతిలో చేరవేయడంలో కానీ గణాంకాలతో చెప్పడంలో కానీ ఆధారాలతో తిప్పికొట్టడం లో కానీ మనం సాటిరాలేము అని తెలుసుకున్న బీజేపీ, వైసీపీ మరియు జనసేన పార్టీ వాళ్ళు అసత్య ప్రచారాలకు పదును పెట్టారు.
జీతం ఇచ్చి జీతగాళ్ళని పెట్టుకొని తప్పుడు వీడియోస్ చేపించడం తప్పుడు పోస్టర్లని చేపించడం ఫేక్ అకౌంట్లని తెరిపించి ప్రచారం చేయడం, ప్రభుత్వానికి ఏవేవో ఆపాదించి పోస్టులు కామెంట్స్ పెట్టడం, వేరే రాష్ట్రంలో పూర్తిగా పాడైపోయిన రోడ్ల ఫోటోలని పెట్టి ఇది ఆంధ్ర లో ఫలానా ఊర్లో అని చెప్పి ప్రభుత్వం ఎం చేస్తుంది ఇదేనా అభివృద్ధి అని పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టడం ఎక్కడో రైతు పోలీస్ కాళ్ళని పట్టుకుంటే ఇదేనా రైతులకి మీరు చేసేది అని పెట్టడం ఈ మేధావులు చేసే ఘనకార్యాలకి మచ్చుతునకలు. ఇలాంటి దుర్మార్గపు చేష్టలకి తెలుగు దేశం పార్టీ కాకుండా మరొక పార్టీ అయ్యి ఉంటె కుట్రలకు బలైపోయేది త్రిపురలో మాణిక్ సర్కార్ లాగా.
ఎన్ని కుట్రలు పన్నినా తెలుగు దేశం పార్టీకి ఉన్న అశేష అభిమానగణం ముందు సోషల్ మీడియా లో వాళ్ల ఆటలు సాగట్లేదు. ఒక తప్పుడు పోస్ట్ పెట్టిన గంటల వ్యవధిలోనే ఆధారాలతో సహా ఆ పార్టీలని తూర్పారపట్టడం పసుపు దళానికి నిత్యకృత్యం. అందుకే బాబు గారు అభివృద్ధి మీరు చూసుకోండి కుట్రలు మేము తిప్పికొడతాం అనే నినాదం తో పసుపు దళం పని చేస్తుంది. ప్రతిపక్షాలు సిగ్గు పడాలసింది ఏమిటంటే వాళ్ళు ఇలాంటి కుట్రలకు సమయం కేటాయిస్తుంటే పసుపు సైనికులు ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నారు. సమస్యలు ఎక్కడన్నా ఉంటె తప్పు ఎక్కడన్నా జరుగుతుంటే తామే ముందుండి వాటిని ప్రభుత్వ దృష్టికి వచ్చేటట్లు చేస్తున్నారు. అవసరం అయితే కొన్ని విషయాలలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా వెనుకాడట్లేదు. జన్మభూమి కమిటీల రద్దు గాని, గ్రామాలని దత్తతు తీసుకుంటే ఎదురౌతున్న సమస్యల గురించి గాని ఇలాంటివి కొన్ని ఉదాహరణలు.
తుఫాను వచ్చి సిక్కోలు అతలాకుతలం అయ్యినా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మననంల్ని పొందడం చేతగాక వెటకారంగా పోస్ట్ లు పెడుతూ నీచపు బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. మరో పక్క తెలుగుదేశం కార్యకర్తలు శ్రీకాకుళంలో సేవలు అందిస్తున్నారు. ఇది చాలదా వైసీపీ జనసేన బుద్ధిని తెలుసుకోవడానికి? ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేసి అప్రదిష్టపాలు చేయడమే పరమావిధిగా పెట్టుకోవడమే కానీ మంచి పనులు చేసి ప్రజలకి దగ్గర అవుదాం అనే ఆలోచన ఏ కోశానా లేదు. ఇలాంటి వాళ్ళు చేసే కుట్రలని ఎక్కడికక్కడ ఎదురుకుంటాం అని పసుపు సైనికులు ముక్తకంఠం తో చెప్తున్న మాట.
తెలుగు దేశానికీ అండ దండా కార్యకర్తలే క్రమశిక్షణకు మారుపేరు అయ్యిన కార్యకర్తలు. డబ్బు కోసం గడ్డి తినే రకాలు కాదు అవసరం అయితే సొంత డబ్బుతో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు.
________________________ప్రసాద్