blog single post
editoryal

2018-10-11 06:01:00

'ప్రశ్నించడానికే నేను'.. అని చెప్పి 'ఒక ప్రశ్నగానే మిగిలిపోతావా!'... పవన్ ?

పట్టుదల, స్థిరత్వం, వ్యూహ చతురత, అవగాహన, ఓపిక, తపన ఇవన్నీ రాజకీయ నాయకుడిలో ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ అలవర్చుకుని నాయకుడిగా పవన్ కళ్యాణ్ పరిణితి చెందుతాడుకునే వాళ్లకి తీరని నిరాశే మిగిలింది. ఒక రోజు నేను ప్రశ్నించడానికే ఉన్నా అని అంటారు ఇంకో రోజు నేనే ముఖ్యమంత్రి ని అంటారు ఇంకో రోజు నేను కింగ్ ని కాదు కింగ్ మేకర్ ని అంటారు ఏ క్షణాన ఎలా మారునో పవన్ మైండ్ అని అర్ధం కాక తలలు పట్టుకోవలసి వస్తుంది. ప్రజలు బానిసలు కాదు అని చెప్తూ తానే ఢిల్లీ కి బానిస అయ్యాడంటే ఆయన వ్యవహారం ఏంటో అర్ధం అవుతుంది. తెలుగు వాడి వేడి తెలుగు వాడి పౌరుషం తెలుగు వాడి ఆత్మగౌరవం ఇవేవి ఆయనకీ పట్టనట్లు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ కొమ్ము కాస్తూ కేవలం చంద్రబాబు ని దింపడం తన లక్ష్యం అని నిసిగ్గుగా ప్రకటించుకుంటూ తిరగడం తెలుగు ప్రజలు హర్షిస్తారా? తప్పులుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అందరి హక్కు కానీ అన్యాయం చేసిన ఢిల్లీ ఎజెండా ని అమలు చేస్తూ నోటికి పని చెప్పడం దుర్మార్గం. చే గువేరా స్ఫూర్తి తో ప్రత్యేక హోదా ఉద్యమం అని చెప్పి గడ్డం పెంచుకొని ఊరూరూ తిరుగుతూ అయన చేస్తున్న పనేంటో నిక్కరు వేసుకున్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. స్థిరత్వం లేకపోయినా మనిషి మంచోడు నిస్వార్ధంగా ఉంటాడు అని జనాలలో కొద్దిగా ఉండేది కానీ అయన చేస్తున్న పనులకి మంచితనం ముసుగులో కొత్తగా ఎవరన్నా వస్తే జనాలు నమ్మలేని పరిస్థితి వచ్చింది.
కొత్త రాజకీయం అన్నారు అబ్బో అనుకున్నాం ఇప్పుడు అబ్బా నాయనా చాలు బాబోయ్ అని అనుకుంటున్నాం. సార్ తో కాఫీ తాగాలంటే ఒక రేట్ సార్ తో టిఫిన్ చేయాలంటే ఒక రేట్ సార్ తో భోజనం చేయాలంటే ఒక రేట్ ఇది ప్రజారాజ్యానికి మరో రూపం కాక ఏంటి? మరీ ముఖ్యంగా ఎవరో శ్రీ రెడ్డి విషయం లో అయన ఆడిన గేమ్ ఏదైతే ఉందొ ఇదే కదరా కొత్త రాజకీయం అంటే అని సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు జనాలు. నేను దేవుడిని నేనే దేవుడిని నేను మాత్రమే దేవుడిని నేను శాసిస్తా నా పిచ్చి భక్తులు పాటిస్తారు అన్నట్లు అయన వ్యవహారశైలి అబ్బో నభూతో న భవిష్యత్. నా సభలని చూసి మతిపోయి నన్ను చంపడానికి గేదలని తోలుతున్నారు నా సభలకి అని చెప్పడం అయ్యినా నా ఇంటి మీద కి డ్రోన్ లు తిప్పుతున్నారు అని చెప్పడం అయ్యినాఆయనకే సాధ్యం. రెండు లక్షల పుస్తకాల జ్ఞానం ఇలా బయటపడుతుందేమో అని అనిపించక మానదు.
ఎర్ర తువాలు వేసుకొని వచ్చిన ప్రతి వాడు ఉద్యమకారుడు అయ్యిపొడు అమ్ముడు పోయే వాడు ఆ ఎర్ర తువాలు వేసుకొని వచ్చి మోసం చేయకూడదు. ఏం ఆశించి నీ లక్ష్యాన్ని మార్చుకున్నావో ఏం ఆశించి మోడీ ని ఒక్క మాట కూడా అనవో ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నావో నీకే తెలియాలి పవన్ బాబు. నీలో విషయం ఉందా చంద్రబాబు తో సరితూగగలవా ఆయనలా కష్టపడగలవా ఆయనలా పెట్టుబడులు తేగలవా ఆయనకన్నా గొప్పగా ఏం చేస్తావో చెప్పే దమ్ము ఉందా? ఏది కంపెనీ ఓ ఏది వ్యక్తి పేరో కూడా తెలియని నీకు రాష్ట్రాన్ని ఉద్ధరించే సత్తా ఉందా? ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఏమైంది అది మోడీ మొకాన ఎందుకు కొట్టలేదో చెప్పగలవా? 70000 కోట్లు మనకి రావాలి అన్నావ్ మరెందుకు నోరు మెదపవు దాని వెనక మతలబు ఏంటో చెప్పగలవా? ధవళేశ్వరం బ్రిడ్జి మీద కవాతు చేస్తావా మోడీ ఇంటి ముందు పన్నీరు చల్లుతావా? ఇదే కదా మార్పు తేవడం అంటే ఇదే కదా ప్రజలకి సేవ చేయడం అంటే ఇదే కదా నవశకం అంటే?
నా వల్లే తెలుగుదేశం గెలిచింది అన్నోడివి ఈ రోజు నేను 2019 లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తా అంటున్నావ్ అంటే నీ సత్తా అదేనా అంతేనా? ప్రశ్నించడానికి వచ్చావ్ ప్రశ్నించబడుతున్నావ్, సమాధానాలు కావలి అంటున్నావ్ సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నావ్. నా మీద కుట్రలు జరుగుతున్నాయి అన్నావ్ రాష్ట్రం మీదే కుట్రలు చేసే స్థాయికి వచ్చావ్. పని చేసే వాలని తిడతావ్ మోసం చేసే వాలని ఆకాశానికి ఎత్తుతావ్ దీనికోసమేనా పవన్ రాజకీయాలలోకి వచ్చింది? ప్రజారాజ్యం ని ముంచేసి కాంగ్రెస్ లో కలిపారు జనసేన ని ముంచేసి బీజేపీ లో కలిపేయి ఇంకెందుకు ఆలస్యం? ప్రశ్నించడానికి వచ్చావ్ ఒక ప్రశ్నగా మిగిలిపోతావ్ మారకపోతే. కుట్రలని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

______________ప్రసాద్